ఎడిటోరియల్
క్రీస్తు నందు నాకు అత్యంత
ప్రియమైన కడబూరధ్వని పాఠకులకు ప్రభువు పేరట శుభములు తెలియజేస్తున్నాను. మీరూ, మీ కుటుంబాలు, మీ పరిచర్యలు
క్షేమంగా, ఆశీర్వాదకరంగా వున్నాయని ప్రభువుయందు విశ్వసించుచు ఇంకా వర్ధిల్లాలని, విస్తరించాలని ప్రార్థిస్తున్నాను.
అలాగే మీరు కూడా ఈ దీన సేవకుని కొరకు,
దేవుడిచ్చిన చిన్న పరిచర్య కొరకు ప్రార్థించాలని కోరుచున్నాను.
ప్రియమైన దైవజనాంగమా! ఇన్ని దినాలు ఎన్నో సమస్యల సుడి గుండాలు దాటాము మరి ఇక ముందు కూడా పరిచర్యలో, కుటుంబంలో, పిల్లల విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అదిగమించాలో అని అనుకుంటున్నారా? అయితే కీర్తనకారుడు చెప్పే ఒక మాట ‘‘కీర్తన 105:5 ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి’’ ఈ మాటకు అర్థం ఏమిటంటే మన పితరులను ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ ఏలాగు నడిపించాడో, పరమ కానానుకు చేర్చి స్థిరపరిచాడో అబ్రహాము సంతతి వారమైన, ఏర్పరచబడిన మనలను కూడా ఆలాగుననే చేరుస్తాడు. నీ, నా జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటే మనకు ప్రభువు యందు ఇంకా విశ్వాసం పెరుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. అలాగే మనం ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొని స్తుతించినట్లయితే అబ్రహాముతో చేసిన అ నిబంధనను జ్ఞాపకము చేసికొన్నట్లుగా ఆయన మన పట్ల చేసిన వాగ్దానాలను గుర్తు చేసుకుంటాడు. ఇంతవరకు మనలను దాటించి, పోషించి, కాపాడిన దేవుడే ఇకముందు కూడా రాజులను గద్దిస్తూ మనలను కానానుకు అనగా నెమ్మది గల స్థలమునకు చేరుస్తాడు. కనుక ఇంకా గొప్ప భక్తి చేస్తూ ధైర్యంగా ముందుకు సాగిపోదాము. ఇట్టి కృప మీకు కలుగును గాకా... ఆమెన్.!!

మీ సహోదరుడు
Pastor B.S.Benher Editor, Kadabura Dhwani MagazineMagazine - Editions
-
home Home Page
-
infoAbout
KADABURA DWANI is a Christian Spiritual Monthly Magazine Published by Pastor. B.S. Benher of The Holy Mountain Ministries, Adilabad, Telangana. The mission of the magazine is "to help people from all walks of life to achieve their maximum personal and spiritual potential."
-
history_edu Editorial
-
newspaper Latest Edition